భారతీయులలో మిగిలి ఉన్న తీక్షణతను, చురుకుదనాన్ని, సృజనాత్మకతను ఇంకా కాపాడుకునే ఉన్నాం.  ఇప్పటి చదువులతో అది కూడా పోతే పునరుద్ధరింప అలవి కాని నైచ్యానికి, తుదకు సర్వనాశనానికి  నాంది పలికిన వాళ్ళమవుతాము’ .  

స్వామీ ఆరబిందో, 1910 వ సంవత్సరం.

స్వాతంత్రానంతరం భారతదేశ ప్రాచీన విద్యా వ్యవస్థని పునరుజ్జీవింపజేసి మరింత పటిష్టంగా తీర్చిదిద్దుకుంటాం.

గాంధీ, అక్టోబర్ 20, 1930

సుధీ భారతీయ జ్ఞానాన్ని పునరుజ్జీవింపజేసి, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి, యువతని  శక్తివంతం చేయడానికి, దేశ శాంతి–సమృద్ధ భవిష్యత్తుకు దారి చూపాలని సంకల్పించింది .

రండి …..!  ఉజ్వలమైన రేపటికోసం పాఠశాలల ద్వారా సమాజానికి భారతీయ విజ్ఞానాన్ని చేరవేద్దాం. 

SUDHEE – Social Upliftment for Developing Holistic
Education and Empowerment

సుధీ స్వచ్ఛంద సంస్థ, భారతీయ జ్ఞాన పరంపర – భారతీయ జ్ఞాన వ్యవస్థ (IKS)   ఆధునిక జీవితానికి ఎలా ప్రయోజనకారో ప్రచారం చేసి, భారతీయ జ్ఞాన పరంపరని  పునరుజ్జీవింపజేసే ప్రయత్నం చేస్తోంది. కాలానుగుణ విద్యతో భారతీయ జ్ఞానాన్ని సమన్వయపరచి విద్యార్థులకు, సమాజానికి అధిక ప్రయోజనం చేకూర్చే  కార్యక్రమానికి  అంకితమైంది.  విలువలతో నిండిన సమగ్ర జీవనంతో కూడిన సమాజాన్ని నిర్మించాలన్న తపనగల  వ్యక్తుల సమష్టి వేదికగా రూపొందిన ఈ సుధీ, ప్రాచీన జ్ఞాన సంపదను సమకాలీన అవసరాలకు అనుసంధానించే వారధిగా నిలుస్తుంది.

మా కార్యక్రమాలు

సుధీ సంస్థ ద్వారా, పాఠశాలలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులతో కలిసి, భారతీయ జ్ఞాన వ్యవస్థ (Indian Knowledge System – IKS) ను పాఠశాలలు, కమ్యూనిటీలకు పరిచయం చేయడానికి కృషి జరుగుతుంది. విద్యార్థులకు, ఈ అమూల్యమైన జ్ఞాన సంస్కృతి గురించి, నేటి పోటీ ప్రపంచంలో దాని ప్రాముఖ్యతను తెలియజెప్పి, వారిని సమాయత్తం చేయడమే సుధీ లక్ష్యం. నిర్మాణాత్మక కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లు, పరస్సపర సహకారాల ద్వారా IKS ను విద్యావ్యవస్థలోకి ప్రవేశపెట్టడం సుధీ చేపట్టే కార్యక్రమం.

సుధీ సంస్థ, IKSను విద్యార్థుల వయస్సుకు తగిన విధంగా, ఆకర్షణీయంగా మరియు ఆధునిక విద్యకు అనుగుణంగా అందించే కార్యక్రమాలను రూపొందిస్తోంది. ఈ కార్యక్రమాలు ఉన్నత తరగతుల కోసం కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దబడుతున్నాయి.

పాఠశాల విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం

పాఠశాలలు రోజుకు ఒక గంట సమయం కేటాయించడం ద్వారా ఈ ఒక వారం అదనపు పాఠ్యేతర కార్యాకలాపాన్ని(కో-కరిక్యులర్ యాక్టివిటీని) నిర్వహించవచ్చు, దీనిలో విద్యార్థులకు ఇంటరాక్టివ్ సెషన్‌లు, వక్తృత్వం, వ్యాసరచన మరియు క్విజ్ పోటీలు నిర్వహింపబడతాయి.

ఉపాధ్యాయుల కోసం భారతీయ జ్ఞాన వ్యవస్థపై అవగాహనా కార్యక్రమం

అర్థవంతమైన అభ్యాసానికి ఉపాధ్యాయులే ముఖ్య సూత్రధారులుగా సుధీ గుర్తిచింది. పాఠశాలల్లో భారతీయ జ్ఞాన వ్యవస్థ (IKS) ను సమర్థవంతంగా అందించడానికి, సుధీ ప్రత్యేక ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాలను రూపొందించి చేపడుతుంది.

తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమం

తల్లిదండ్రులు తమ పిల్లలను సమగ్ర అవగాహనతో  పెంచేందుకు, స్వీయ సహాయ పద్ధతులు మరియు సాంస్కృతిక జ్ఞానం పెంపొందించుకోవడానికి, కుటుంబ శ్రేయస్సు, సమాజ సమన్వయం, మరియు విలువలతో నిండిన జీవనానికి పునాదులు వేయడానికి ఈ అవగాహనా సదస్సుల  కార్యక్రమం ఉపయోగపడుతుంది.