సుధీ గురించి

సుధీ స్వచ్ఛంద సంస్థ, భారతీయ జ్ఞాన పరంపర

(Indian Knowledge System)

సుధీ స్వచ్ఛంద సంస్థ, భారతీయ జ్ఞాన పరంపర  ఆధునిక జీవితానికి ఎలా ప్రయోజనకారో ప్రచారం చేసి, భారతీయ జ్ఞాన పరంపరని  పునరుజ్జీవింపజేసే ప్రయత్నం చేస్తోంది. కాలానుగుణ విద్యతో భారతీయ జ్ఞానాన్ని సమన్వయపరచి విద్యార్థులకు, సమాజానికి అధిక ప్రయోజనం చేకూర్చే  కార్యక్రమానికి  అంకితమైంది.  విలువలతో నిండిన సమగ్ర జీవన సమాజాన్ని నిర్మించాలన్న తపనగల  వ్యక్తుల సమిష్టి వేదికగా రూపొందిన ఈ సుధీ, ప్రాచీన జ్ఞాన సంపదను సమకాలీన అవసరాలకు అనుసంధానించే వారధిగా నిలుస్తుంది.

సుధీ దృష్టిలో విద్య, పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, ప్రపంచ జ్ఞానంతో పాటు భారతీయ స్థానిక  వారసత్వంలోని సమగ్ర విజ్ఞానాన్ని కూడా అందించాలి. భారతీయ జ్ఞాన పరంపర(IKS)ను ప్రధాన విద్యా శ్రవంతిలో  భాగంగా చేస్తే, యువతలో స్వతంత్ర భావాలు, అభ్యాస సామర్థ్యం, అవగాహన, ఉత్పాదకతలు వికసిస్తాయని మా నమ్మకము. ప్రాచీన భారతీయ విజ్ఞానాన్ని ఆధునిక అభ్యాసంతో మేళవించడం ద్వారా విద్యార్థులు, కుటుంబాలు, సమాజాలు సమతుల్యంగా, సామర్థ్యవంతంగా, సామాజిక  స్పృహ కలిగినవారిగా ఎదిగి, తమ జీవితాలతో పాటు సమాజం మరియు ప్రపంచాన్ని కూడా సమృద్ధి పరచగలరు అన్నది సుధీ విశ్వాసం.

 దార్శనికత:

భారతదేశం ప్రతి రంగంలోనూ మరలా విశ్వగురువుగా వెలుగొందాలి.

భారత దేశం తన ప్రాచీన వైభవాన్ని తిరిగి పొందేలా శక్తివంతం కావాలి. స్వయంసమృద్ధిగా, పరతంత్ర భావాలను వీడి స్వతంత్ర భావాలతో, స్వాభిమానంతో నిలబడాలి. భారతీయ స్థానిక జ్ఞాన పరంపర పునరుజ్జీవనంతో భావదాస్యం మరియు పాశ్యాత్య సాంస్కృతిక బంధనాల నుండి విముక్తి పొంది పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలి.

సుధీ దృక్పథం

సామాజిక సమతుల్యతను అభివృద్ధి చేసే విద్యా వ్యవస్థను తిరిగి నిర్మించాలి. భారతీయ జ్ఞాన పరంపర ద్వారా జ్ఞానం, సమతుల్యం, శాంతి, శ్రేయస్సు తరతరాలకూ అందేలా విద్యను పునర్నిర్వచించాలి.

సుధీ విశ్వాసం

ప్రస్తుతం జీవనోపాదికే  పరిమితమైన విద్యా వ్యవస్థకు, భారతదేశ జ్ఞాన పరంపరను జోడించి పరిపుష్ఠికరం చేయగలిగితే, ఆధునిక ప్రపంచ అవసరాలను అవలీలగా తీర్చగల మానవ సామర్ధ్యం సమకూరుతుంది. సమగ్ర అభివృద్ధి, విలువలతో కూడుకున్న సుసంపన్న జీవనం హస్తగతం అవుతంది.

సుధీ  ఆశయాలు

E

ఆధునిక విద్యను భారతీయ విధానంతో మేళవించి తీర్చిదిద్దడం

స్థానిక ప్రాచీన జ్ఞానాన్ని ఆధునిక సాంకేతిక, సమాచార విద్యతో మేళవించి, ప్రభావశీకలమైన భారతీయ విద్యా విధానాన్ని సృష్టించడం.

E

చదువు ద్వారా డబ్బు సంపాదనే కాకుండా, సమగ్ర మానవ వికాసానికి దారి చూపడం

చదువు ద్వారా కేవలం జీవనోపాధి పొందడమే కాకుండా, పాఠశాల స్థాయి నుండే విద్యార్థులలో వ్యక్తిత్వం, విలువలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడం ద్వారా కరుణతో కూడిన బాధ్యతాయుతమైన  పౌరులుగా తీర్చిదిద్దడం.

E

విషయాలుగా విభజింపబడ్డ విద్యను సమగ్ర అభివృద్ధికి దోహదకారిగా మలచడం

పంచకోశ ఆధారిత దృక్పథాన్ని అనుసరించి శరీరం, మనసు, మేధ, ఆత్మ అన్నింటిలోనూ సమతుల్య అభివృద్ధి కలిగించడం.

E

గురుకుల స్ఫూర్తిని పునరుద్ధరించడం

ప్రకృతి సాన్నిధ్యం, గురువుల పట్ల గౌరవం, స్వీయ నియంత్రణ, అనుభవాధారిత జ్ఞానార్జన వంటి పూర్వపు విద్యా పద్ధతులను తిరిగి అనుసంధానించడం.

E

పారంపర్యం–ఆధునికత మధ్య సమన్వయం

భారతీయ స్థానిక విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రసాంకేతికతలతో మేళవించి, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యాన్ని విద్యార్థులలో పెంపొందిచడం.

సుధీ లక్ష్యం

భారతీయ జ్ఞాన పరంపరాగత వ్యవస్థ(Indian Knowledge System – IKS)ని పునరుజ్జీవింపజేయడం, రక్షించడం మరియు వ్యాప్తి చేయడం. ప్రస్తుత చదువులలో భారతదేశపు శాస్త్రీయ జ్ఞాన వారసత్వపు ఆవశ్యకతని, ఆ జ్ఞానాన్ని వెలికి తీసిన  వైజ్ఞానిక ఋషుల(Rishis)ని,  వారి ఘనతని  విద్యార్థులు, యువత, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు లాంటి సమాజిక  సమూహాలకి తెలియజేయడం. చదువుల ద్వారా పొందిన విద్యని అమ్ముకొని డబ్బు సంపాదించడమే కాకుండా, ఆచరించి శారీరక, మానసిక, ఆరోగ్యాలు కాపాడుకుని, సంపన్న సమ సమాజ అభివృద్దికి తోడ్పడే విధంగా వ్యక్తుల ఆలోచనలు ఎదగడానికి తోడ్పడే కార్యక్రమాలు చేపట్టడం.

ఈ లక్ష్య సాధనలో సుధీ అనుసరించే పద్ధతులు

E

కార్యక్రమం

ఆధునిక విద్యకు అనుబంధంగా భారతీయ జ్ఞాన సంపదను, ఆ సంపద సృష్టించిన వైజ్ఞానిక ఋషులను పరిచయం చేసే కార్యక్రమాలను బడులలో ప్రవేశ పెట్టి, వారిలో భారతీయ జ్ఞాన పరంపర పట్ల ఆసక్తి కలిగించటం.  ఈ కార్యక్రమాల ద్వారా  విద్యార్థులలో జిజ్ఞాస, ఆత్మవిశ్వాసం మరియు సమగ్రాభివృద్ధిని పెంపొందించి, సమకాలీన విద్యను సమర్ధవంతంగా నేర్చుకోవడానికి తోడ్పాటును అందించడం.

E

విద్యార్థుల సామర్థ్యాలను పెంపొందించడం

7వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులలో ఏకాగ్రత, అవగాహన సామర్థ్యం, స్మరణశక్తిని పెంపొందించడం  కోసం యోగా, ధ్యానం, కథలు చెప్పడం, ప్రాచీన అధ్యయన పద్ధతులు వంటి ప్రాచీన పద్ధతును పరిచయం చేయటం.

E

ప్రతి విద్యార్థినీ చేరుకోవడం

పాఠశాలలు, పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల  విద్యార్థులకు ఈ జ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చే సుస్థిర విధానాలను ఏర్పాటు చేయడం.

E

ఉపాధ్యాయులను సమాయత్తం చేయడం

ఆసక్తి గల ప్రధాన పాఠశాలల ఉపాధ్యాయులకు  IKS జ్ఞానాన్ని సమర్థవంతంగా, ఆత్మవిశ్వాసంతో పంచగలగడంలో శిక్షణ ఇవ్వడం.

E

జ్ఞాన మండలి సృష్టించడం

పాఠశాలల్లో, విశ్లేషకులు, ఆలోచనా పరులు, సమస్యా పరిష్కర్తలు లాంటి సకల వర్గాలవారిని కలిపి సమగ్ర విద్య కోసం ఒక సుహృత వాతావరణాన్ని సృష్టించడం.

E

పాఠ్యాంశాల నిర్మాణం

భారతీయ జ్ఞాన వ్యవస్థలతో అనుసంధానమైన, ఆధునిక పాఠ్య విధానానికి అనుగుణమైన, పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయం, పీ.జీ, పరిశోధన స్థాయిలకు విస్తరించగల విద్యా విషయాలతో కూడిన పాఠ్య పుస్తకాల నిర్మాణం.

E

తల్లిదండ్రులు & యువత కోసం అవగాహనా కార్యక్రమాలు

అధికారిక విద్యా వ్యవస్థ వెలుపల తల్లిదండ్రులు మరియు యువత కోసం పరస్పర సంపర్క కార్యక్రమాలు, మేధోమధనాలని  మరియు సామూహిక చొరవలని ప్రోత్సాహయినకడం, IKS ప్రయోజనాలు కుటుంబాలు మరియు సమాజానికి చేరే విధంగా  కార్యక్రమాలు నిర్వహించడం.

E

యువతలో మానసిక ఒత్తిడి ఇంకా జీవనశైలి నిర్వహణ

యువతలో ఆరోగ్యకరమైన జీవనశైలి, భావోద్వేగ సమతౌల్యం, ఒత్తిడి రహిత జీవనం మార్గదర్శనం, వ్యక్తిగత శ్రేయస్సు మరియు సామాజిక సామరస్యం పెంపొందించడం.

E

శాంతి & సమృద్ధికి దోహదం

వ్యక్తులలో అంతర్గత శక్తి,  ఆలోచనలలో శాస్త్రబద్ధత, దాయార్ద్ర హృదయం పెంపొందించడం కోసం, విద్య కేవలం జ్ఞానార్జనకు మాత్రమే కాకుండా, సామాజిక శాంతియుత సహవాసం, సాంస్కృతిక అభిమానం మరియు సార్వజన సమృద్ధికి దోహద పడే సాధనంగా మారాలని సుధీ సామాజిక కార్యక్రమాలు చేపడుతోంది.

E

విద్యా సంస్థలకు తోడ్పాటు

భారతీయ విజ్ఞాన్ని అమలు పరిచే విద్యా సంస్థలకు సౌకర్యాల అభివృద్ధి, పాఠ్యాంశాల నిర్మాణం, ఆచార్యులను నియమించడం, వనరుల భాగస్వామ్యం మొదలైన వాటిలో సుధీ తోడ్పడుతుంది.

E

గ్రామీణ మౌఖిక జ్ఞానాన్ని సేకరించడం మరియు రక్షించడం

దేశంలోని గ్రామాలలో తరతరాలుగా మౌఖికంగా ఉండిపోయిన అమూల్యమైన జ్ఞానాన్ని సంరక్షించడం. వ్యవసాయం, ఆరోగ్య పద్ధతులు, స్థానిక పర్యావరణం, కళలు, లోకకథలు, సామూహిక సంప్రదాయాలపై ఆధారపడిన ఈ జ్ఞానం, గ్రామీణ సమాజాల జీవన అనుభవాలు మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ మౌఖిక సంప్రదాయాలను క్రమబద్ధంగా అక్షరీకరించడం,  రక్షించడం, పంచుకోవడం ద్వారా,  ఆధునికీకరణ పేరుతో అవి అంతరించి పోకుండా కాపాడి, వాటిలోని సుస్థిర అభివృద్ధికి ప్రేరణనిచ్చే విషయాలపై పరిశోధనల ద్వారా ఆవిష్కరింప జేయడం.

సుధీ బృందం

  • బ్రహ్మశ్రీ. నరేంద్ర కాప్రే గురూ జీ
  • స్వామి మాధవానంద ప్రతినిధి
  • శ్రీ. ఎల్.వి. సుబ్రహ్మణ్యం గారు IAS (మాజీ ప్రధాన కార్యదర్శి, A.P)
  • శ్రీ. రాజ్ వేదం
  • శ్రీ. ముక్తేశ్వర రావు IAS (Rtd)
  • శ్రీ. MG. గోపాల్
  • శ్రీ. డా. రాఘవరావు (డైరెక్టర్ IIT-తిరుపతి, Rtd)
  • శ్రీ. నరేందర్ రెడ్డి
  • శ్రీ. కృష్ణం రాజు
  • శ్రీ. యాదయ్య
  • శ్రీ. లక్ష్మా రెడ్డి
  • శ్రీమతి రాధా రాణి
  • శ్రీ. రెడ్డి (రిటైర్డ్ జడ్జి)
  • శ్రీ. అనంతకృష్ణ నారుమంచి
  • శ్రీ. నరసింహారావు (సిబిఐటి)
  • శ్రీ. E. శ్రీనివాస్ (IIT-B)
  • శ్రీ. పెనమకురి రవికుమార శర్మా
  • శ్రీమతి డాక్టర్ కోదాటి విజయలక్ష్మి
  • మాతృశ్రీ. అనంతలక్ష్మి (అనాది)
  • శ్రీమతి అనిత (సంఘమిత్ర)

మార్గదర్శకులు & భాగస్వాములు

కుడలీ శారదా ఫౌండేషన్ 

సంస్కృత భారతి

అనాది ఫౌండేషన్

నిరామయ సొసైటీ

ఋషి వాటికా గురుకులం

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వేద సైన్సెస్

హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా

థింక్ ట్యాంక్

CG ఎక్స్పర్ట్స్ 

ప్రజా వాణి

Click Here