7–9 వ తరగతుల విద్యార్థుల కోసం
ఓం శ్రీ గురుభ్యో నమః
సాధనాత్ సాధ్యతే సర్వం
భారతీయ జ్ఞాన పరంపర(Indian Knowledge Systems – IKS) ఆధారంగా
పాఠశాల విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం.
1. భారతీయ జ్ఞాన వ్యవస్థ అంటే ఏమిటి?
భారతదేశంలో యుగ యుగాలుగా, తరతరాలుగా ఋషులు, మేధావులచే నిర్మాణం చేయబడింది సుస్థిర జ్ఞాన భాండాగారం. ఈ ప్రాచీన స్థానిక జ్ఞానాన్ని ఆధునిక సాంకేతిక, సమాచార విద్యతో మేళవించి, ప్రభావశీకలమైన భారతీయ విద్యా విధానాన్ని సృష్టించడం.
2. ఇది పిల్లలకు ఎందుకు అవసరం?
భారతీయ జ్ఞాన వ్యవస్థ పిల్లలలో
- ఏకాగ్రత, స్మరణశక్తి, తార్కిక ఆలోచన మరియు విషయ అవగాహనను మెరుగుపరుస్తుంది.
- ప్రాచీన జ్ఞానాన్ని, పఠన పద్దతులను అనుసంధానం చేయడం ద్వారా ఆధునిక విద్యను సమర్ధవంతంగా నేర్చుకోగలుగుతారు.
- విమర్శనాత్మక మరియు సృజనాత్మక శక్తిని పెంపొందిస్తుంది.
- శ్రవణ, మనన, ఆచరణాభ్యాస పద్ధతులతో ఆధునిక విజ్ఞానాన్ని నేర్చుకునే తత్వాన్ని ప్రేరేపిస్తుంది.
- అనుభవాత్మక విద్యా విధానాన్ని ప్రోత్సహించడంలో కీలకంగా పనిచేస్తుంది.
- అంతర్విషయాల (Interdisciplinary) అభ్యాసానికి ఉపయోగ పడుతుంది.
- భారతీయ జ్ఞాన ప్రేరణతో నూతన ఆవిష్కరణలకు యువతరం పూనుకుంటుంది.
- స్వీయ సంస్కృతి పట్ల గౌరవ భావనని పెంచుతుంది.
- ప్రకృతి–సమతుల్య జీవనశైలిపై అవగాహన పెంచుతుంది.
- ఆయుర్వేదం, యోగా ద్వారా ఆరోగ్యకర జీవన విధానాల ఆచరణను ప్రేరేపిస్తుంది.
- జాతీయ విద్యా విధానం (NEP 2020) లక్ష్యాల అనుగుణంగా అభివృద్ధి
- విద్యార్థులు సాంస్కృతిక, శాస్త్రీయ, పర్యావరణ సంబంధిత అంశాలను అనుబంధ విషయాలుగా నేర్చుకుంటారు.
3. ఏ వయసు విద్యార్ధులను లక్షంగా ఈ కార్యక్రమం రూపొందింది!
- 7వ, 8వ మరియు 9వ తరగతుల విద్యార్థులు
4. విద్యార్థులకు పరిచయం చేయబడే అంశాలు (ఉదాహరణలు):
- భారతీయ విద్యా విధాన పరిచయం
- ఆయుర్వేద సిద్ధాంతాలు & శాస్త్రీయ ఆధారాలు
- అష్టాంగ యోగా – హఠయోగ వివరాలు
- పంచకోశాలు – మానవ వికాసం పరిచయం
- ప్రాచీన భారత గణితశాస్త్రం, ఖగోళశాస్త్రం
- ప్రాచీన ఖగోళ కథలు, వాటికి ఆధునిక అన్వయాలు
- భారతీయ కళలు (సంగీతం, నాట్యం, యుద్ధ, జీవన కళలు)
- ప్రాచీన భారతీయ ఋషులు, శాస్త్రవేత్తలు, మేధావులు – వారి కృషి
- భారతీయ కాల గణన మూలాలు, ఖగోళశాస్త్రం, వేద గణితం
- భారత తత్వశాస్త్రాల పరిచయం (Indian Philosophy)
- పురాణ ఇతిహాసాలలోని శాస్త్రీయ కథనాలు
- భారత శాస్త్రవేత్తల కృషి (కణాద, శ్రీనివాస రామానుజన్, జే.సి.బోస్, స్వామి వివేకానంద)
5. సమయ పరిమితి & నిర్వహణ వ్యూహం:
- మొత్తం వ్యవధి: 10–15 గంటలు
- 7వ-9వ తరగతుల విద్యార్థులకు సమష్టిగా 1 నుండి 2 వారాలపాటు ప్రతిరోజూ .
- నిర్దేశిత రోజులలో పాఠశాల చివరి అవధిలో కొంత భాగం (1 గంట) ఉపయోగించుకోవడం
- యువజన దినోత్సవం, ఉపాధ్యాయుల దినోత్సవం, యోగా దినోత్సవం, గణిత దినోత్సవం వంటి రోజుల్లో IKS అంశాలతో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించటం.
6. అమలు విధానం:
- పెద్ద తరగతి గదులు లేదా ఆడిటోరియంలో సమిష్టి బోధన
- దృశ్యాలు, కథలు, ఆటలు, ప్రదర్శనల వంటి ద్వారా బోధన
- అభ్యాసాల ఆధారంగా విద్యార్థుల అంచనా
- చర్చలు, క్విజ్‌లు, ఉపన్యాసాలు, వక్తృత్వం వంటి పోటీ పద్ధతుల ద్వారా.
7. బోధన సన్నాహకాలు & వనరులు:
- IKS రంగంలో పనిచేసే నిపుణులతో భాగస్వామ్యం
- తెలుగు/సంస్కృతం/ఆంగ్ల మాధ్యమంలో బోధన పాఠ్యసామగ్రి
- ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ
- IKS శిక్షణ పొందిన విద్యార్ధులను రిసోర్స్ పర్సన్లుగా ప్రోత్సహించడం
8. సాధించగల ఫలితాలు:
- విద్యా విషయాలపై మెరుగైన అవగాహన
- ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం, భావ ప్రకటన నైపుణ్యాలు
- సాంఘిక సామరస్యాభివృద్ధి
- విద్యార్థులలో చొరవ, పరిశోధనాత్మక ఆలోచనల అభివృద్ధి
- ప్రాచీన జ్ఞాన సంపదకు రక్షణ, అంతర్జాతీయ హక్కుల పరిరక్షణ