సమాజిక కార్యక్రమాలు

తల్లిదండ్రులకు భారతీయ జ్ఞాన పరమపర(IKS) అవగాహన కార్యక్రమాలు

ఉద్దేశ్యం

తల్లిదండ్రులు తమ పిల్లలను సమగ్ర అవగాహనతో  పెంచేందుకు స్వీయ సహాయ పద్ధతులు మరియు సాంస్కృతిక జ్ఞానంతో శక్తివంతులవుతారు. కుటుంబ శ్రేయస్సు, సమాజ సమన్వయం, మరియు విలువలతో  కూడుకున్న  జీవన పద్ధతులను అవలంబించి పిల్లలకు, పొరుగు వారికి నేర్పగలుగుతారు.

తల్లిదండ్రులు మొదటి గురువులు మాత్రమే కాదు, నిత్య జీవితంలో  మార్గదర్శకులు. వారి స్వీయ అవగాహన, సమతుల్యమైన ఆచరణ నేరుగా పిల్లల పెరుగుదలలో ప్రతిబింబిస్తుంది. ఈ బంధాన్ని బలోపేతం చేయడానికి సుధీ సంస్థ భారతీయ జ్ఞాన పరంపర ఆధారిత సామాజిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

ప్రధాన అంశాలు

E

తల్లిదండ్రుల స్వీయ సహాయం & శ్రేయస్సు

  • యోగా, ధ్యానం, ఆయుర్వేద ఆధారిత జీవన విధానం
  • మానసిక ప్రశాంతత మరియు ఒత్తిడి నిర్వహణ పద్ధతులు
E

భారతీయత - పిల్లల సమగ్ర పెంపకం - ప్రాముఖ్యత - అవగాహన

  • సాంప్రదాయాలు, సదాచారాలు వాటిలో శాస్త్రీయత పట్ల పిల్లలకు అవగాహన కల్పించే సామర్థ్యం కల్పించడం.
  • పిల్లలకు స్మరణశక్తి, ఏకాగ్రత మరియు సృజనాత్మకతను పెంచుకునే  తోడ్పాటు ఇవ్వడం లాంటి విషయాలపై అవగాహన. 
  • పిల్లలో  జిజ్ఞాస, క్రమశిక్షణ మరియు సమతుల్య జీవన విధానాలు నెలకొల్పే  సాధారణ గృహపద్ధతులపై అవగాహన.
  • కథల ద్వారా, సాంస్కృతిక ఆచారాల ద్వారా పిల్లల మానసిక వికాసానికి పునాదులు వేసే పద్ధతుల పై అవగాహన. 
E

తల్లి–తండ్రి–పిల్లల సంయుక్త కార్యాచరణలు

  • సంయుక్తంగా సంస్కృత శ్లోకాల ఉచ్ఛారణ , విలువల ఆధారిత చర్చలు
  • సంప్రదాయంలో ఉన్న శాస్త్రీయతపై అన్వేషణ
E

సమాజ చర్దిచా వేదికలు

  • తల్లిదండ్రులు తాము ఎదుర్కునే సవాళ్లకు  పరిష్కారాలు చర్చించడం.
  • పిల్లల మరియు సమాజ శ్రేయస్సుకు కొత్త మార్గాలను కలసి రూపకల్పన చేయడం.
E

పాఠశాల & గృహం మధ్య సమన్వయం

ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమన్వయం ద్వారా విద్యా పద్ధతులు ఇంట్లోనూ బలోపేతం చేయడం

ఫలితాలు

  • తల్లిదండ్రులు స్వీయ శక్తివంతులు, భావోద్వేగపరంగా బలమైనవారు, సాంస్కృతిక మూలాలపై నిలిచినవారు అవుతారు.
  • పిల్లల అభివృద్ధి పట్ల నమ్మకం, సమతుల్యతతో కూడిన దృక్పథాన్ని పొందుతారు.
  • కుటుంబాల ఉమ్మడి జీవిన విధానంతో  శాంతియుత, శ్రేయస్సు, విలువలతో  కూడుకున్న సమాజ నిర్మాణానికి దోహద పడతారు.