ఉపాధ్యాయుల కోసం

భారతీయ జ్ఞాన పరంపర (Indian Knowledge System – IKS)పై అవగాహన, బోధనా సామర్థ్య పెంపు కార్యక్రమం

భారతీయ జ్ఞాన పరంపర(IKS)ను బోధించేలా ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని మెరుగుపరచడం. 

సుధీ సంస్థ, బోధనలో ఉపాధ్యాయుల పాత్రను అత్యంత ముఖ్యమైనదిగా గుర్తిస్తుంది. పాఠశాలలలో భారతీయ జ్ఞాన వ్యవస్థను సమర్థవంతంగా వ్యాప్తి చేయాలంటే, ఉపాధ్యాయుల ప్రాభావశీల శిక్షణ అవసరం. అందుకే, ప్రత్యేకంగా రూపొందించిన ఉపాధ్యాయ శిక్షణా కార్యక్రమాల ద్వారా ఈ కింది ప్రధాన అంశాలపై దృష్టి సారించబడుతుంది:

విషయ ముఖ్యాంశాలు:

E

IKS అవగాహన

 ఉపాధ్యాయులకు భారతీయ జ్ఞాన పరంపర (విద్యా  వ్యవస్థ) యొక్క తత్వం, విస్తృతి మరియు ఆధునిక విద్యా వ్యవస్థలో దాని ప్రాముఖ్యతని పరిచయం చేయడం.

E

విషయ పరిచయం

ఆయుర్వేదం, యోగా, వేద గణితం, ఖగోళశాస్త్రం, పంచకోశ సిద్ధాంతం, భారతీయ సాంస్కృతిక వారసత్వం వంటి మూలభూత అంశాలపై శిక్షణ.

E

బోధనా పద్ధతులు

ఆధునిక తరగతులలో IKS అంశాలను చర్చాత్మకంగా, కార్యాచరణాత్మకంగా బోధించగలిగేలా ఉపాధ్యాయులకు అనుకూలమైన బోధనా ఉపాయాల అవగాహన.

E

సమగ్ర అభివృద్ధి దృక్పథం

 విద్యార్థుల లో ఏకాగ్రత, స్మరణశక్తి, ఒత్తిడి నిర్వహణ, సృజనాత్మకత, విలువల ఆధారిత గుణాలను అభివృద్ధి చేయగల సామర్థ్యం ఉపాధ్యాయులలో పెంపొందించడం.

E

పాఠ్యాంశ సమన్వయం

 IKS అంశాలను ప్రాచీన జ్ఞానాన్ని ప్రస్తుత పాఠ్యాంశాలలో సమర్ధవంతంగా విలీనం చేసే విధానాలను చర్చించడం, అమలు పరిచే సామర్ధ్యం పెంచడం.

E

నిరంతర మద్దతు & వనరుల అందుబాటులో ఉంచడం

ఉపాధ్యాయులకు మాన్యువల్స్, డిజిటల్ కంటెంట్, పునఃశిక్షణ శిబిరాలు వంటి సహాయక వనరులు అందించడం.

నిష్కర్ష:

ఈ శిక్షణ ఫలితంగా ఉపాధ్యాయులు IKS బోధనలో స్వచ్ఛంద మార్గదర్శకులుగా మారుతారు. తమ సామాజిక  పాత్రను సంతృప్తిగా నిర్వర్తించి సమాజంలో గౌరవం,  ప్రాముఖ్యత పొందుతారు.  విద్యార్థులకు  కేవలం పాఠ్య విజ్ఞానమే కాకుండా సంపూర్ణ జీవన నైపుణ్యాలు, సాంస్కృతిక బంధం, మరియు విలువల ఆధారిత జ్ఞానాన్ని కూడా పంచగలుగుతారు.